: శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఆందోళ‌న‌కు దిగిన‌ ప్రయాణికులు


హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఈరోజు ఉద‌యం 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీ వెళ్లడానికి వ‌చ్చిన ప్ర‌యాణికులు తాము వెళ్లాల్సిన విమానం నిలిచిపోవ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంబంధిత‌ అధికారుల తీరు బాధ్య‌తారహితంగా ఉంద‌ని మండిప‌డుతున్నారు. కాగా, హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన‌ ఎయిర్ ఇండియా-559 విమానంలో ఈరోజు ఉద‌యం సాంకేతిక లోపం తలెత్తింద‌ని అధికారులు తెలిపారు. ఈ కార‌ణంగానే ఉదయం 6.40 వెళ్లాల్సిన స‌ద‌రు విమానాన్ని నిలిపివేసిన‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News