: చారిత్రక మార్పు... మారిన ప్రధాని చిరునామా
భారత ప్రధాని అధికారిక నివాసం చిరునామా మారింది. చరిత్ర నుంచి 'రేస్ కోర్స్ రోడ్' అన్న పేరు తొలగింది. రేస్ కోర్స్ రోడ్ పేరును 'లోక్ కల్యాణ్ మార్గ్'గా మారుస్తూ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రధాని నివాసం చిరునామా '5, లోక్ కల్యాణ్ మార్గ్'గా మారింది. 1940లో ఢిల్లీలో రేస్ క్లబ్ కు గుర్తుగా రేస్ కోర్స్ రోడ్ అని ఈ రహదారికి నామకరణం చేశారు. 1984లో రాజీవ్ గాంధీ ఈ రోడ్డులోని 7వ నెంబర్ ఇంట్లో అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకోగా, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 5వ నెంబర్ ఇంటిని నివాసంగా, 7వ నెంబర్ ఇంటిని కార్యాలయంగా నిర్వహిస్తున్నారు. ఈ రోడ్డుకు బీజేపీ ఎంపీ మీనాక్షీ లేహి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గుర్తుగా 'ఏకాత్మా మార్గ్'గా నామకరణం చేయాలని ప్రతిపాదన చేసినప్పటికీ, చివరికి 'జనహితం' ప్రతిబింబించాలన్న ఆలోచనతో 'లోక్ కల్యాణ్ మార్గ్' అని పేరు పెట్టారు.