: తొలిసారిగా సమంత నోట చైతూ మాట!
ఇప్పటి వరకు తన నోటి నుంచి చెప్పని ప్రియుడి పేరును సమంత తొలిసారిగా బయటపెట్టేసింది. 'అవును, ప్రేమలో ఉన్నాను' అని సమంత ప్రకటించిన నాటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ లో ఎన్నో వూహాగానాలు చెలరేగాయి. వీటిని ఎన్నడూ ఖండించని సమంత నవ్వుతూనే దాటవేసింది. అయితే, నాగార్జున, చైతూ కూడా ఈ విషయం చెప్పేయడంతో తను కూడా ఇక దాచడం ఎందుకనుకుందేమో, ప్రియుడి పేరు తన నోటితో కూడా చెప్పింది. "అవును 'చై'తో డేటింగ్ లో ఉన్నాను" అంటూ ప్రకటించింది. ఇందులో దాచేందుకు ఏమీ లేదని కూడా అంది. తామిద్దరికీ కుటుంబ పెద్దల బ్లెస్సింగ్స్ ఉన్నాయని తెలిపింది. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నామన్న విషయం ఇంకా నిర్ణయించుకోలేదని, కుటుంబాలకు కూడా తమ వివాహ తేదీ మూడు నెలల ముందే చెబుతామని సమంత చెప్పింది. 'ఏం మాయ చేశావే' సినిమా నాటి నుంచి తామిద్దరం మంచి స్నేహితులమని సమంత తెలిపింది. ఈ ఏడాది తాము వివాహం చేసుకోవడం లేదని సమంత స్పష్టం చేసింది. వివాహానంతరం కూడా సినిమాల్లో నటిస్తానని తెలిపింది. తమ కుటుంబం, ప్రేక్షకుల ఆదరణపై వివాహానంతరం సినిమాల్లో నటించే విషయమై నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. కుటుంబం తన నిర్ణయాన్ని గౌరవిస్తుందని, ఎందుకంటే సినిమాల గురించి తన కుటుంబానికి తెలుసని చెప్పింది. నాగచైతన్య తన జీవితానికి లంగరు లాంటివాడని తెలిపింది.