: పోతూపోతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సందీప్ పాటిల్


టీమిండియా చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి నిష్క్రమించిన సందీప్ పాటిల్ పోతూపోతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా చరిత్రలో విజయవంతమైన కెప్టెన్‌ గా నిలిచిపోయిన మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగించే విషయంపై పలుసార్లు చర్చ కూడా జరిగిందని ఆయన తెలిపారు. టీమిండియా కెప్టెన్సీని కొత్తవారికి ఇవ్వడం ద్వారా ప్రయోగాలు చేయాలనే చర్చ నడిచిందని ఆయన వెల్లడించారు. అయితే కీలకమైన 2015 వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయలేకపోయామని ఆయన తెలిపారు. ధోనీ అకస్మాత్తుగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన వెల్లడించారు. అలాగే సీనియర్ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, యువరాజ్‌ సింగ్ లను జట్టులోకి ఎంపిక చేయకపోవడంలో కెప్టెన్ ధోనీ పాత్ర ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News