: ‘ఆవాజ్-ఇ-పంజాబ్’ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదు: సిద్ధూ
‘ఆవాజ్-ఇ-పంజాబ్’ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన ప్రకటన చేశారు. ఇటీవలే కొత్తగా ప్రారంభించిన ‘ఆవాజ్-ఇ-పంజాబ్’ అనేది పంజాబ్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రాజకీయ ఫ్రంట్ మాత్రమేనని, రాజకీయ పార్టీ కాదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకుగాను కూటమిలో చేరాలని అనుకుంటున్నామని, ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు చీల్చాలని తాము అనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో 117 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని సిద్ధూ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే సిద్ధూ తాజా ప్రకటన చేయడం గమనార్హం.