: యూత్ బాగా ఎంజాయ్ చేసే చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే’: నటుడు సునీల్


‘మర్యాద రామన్న’ సినిమా తర్వాత ‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రాన్ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తారని ప్రముఖ నటుడు సునీల్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ లో నిర్వహించిన ఒక కార్యక్రమం ద్వారా ఈ చిత్రంలోని నాలుగు పాటల్లో ఒక పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, మొదటి పాటను హైదరాబాద్ లో ఈరోజు ఆష్కరించామన్నారు. మిగిలిన 3 పాటలను వరుసగా వైజాగ్, రాజమండ్రి, విజయవాడలో ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఆడియో ఫంక్షన్ పెట్టి పాటలు రిలీజ్ చేయడం మామూలేనని, ఆ విధంగా కాకుండా కొంత వెరైటీగా ఉండేందుకే ఈ చిత్రంలోని పాటలను ఇలా రిలీజ్ చేస్తున్నామన్నారు. కాగా, వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో సునీల్ సరసన సుష్మా రాజ్, రిచా పనయ్ నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News