: కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు దండుకున్న చరిత్ర ‘నాగం’ది: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు


టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి మయమంటూ బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు దండుకున్న చరిత్ర నాగం జనార్దన్ రెడ్డిది అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు ఆరోపించారు. గతంలో చంద్రబాబు మంత్రి వర్గంలో నంబర్-2గా కొనసాగిన నాగం తెలంగాణలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైద్యుడిగా తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.14 వేల కోట్లు నాగం అక్రమంగా సంపాదించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News