: డ్యాన్స్ బార్లలో సీసీటీవీలు అక్కర్లేదు: సుప్రీం కీలక వ్యాఖ్య
మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లకు అనుమతులు, నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాల నిఘా అవసరం లేదని అభిప్రాయపడింది. బార్లలోని సీసీటీవీల కనెక్షన్లు సమీపంలోని పోలీసు స్టేషన్లకు అనుసంధానమై ఉండాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బార్ యజమానులు కోర్టుకు వెళ్లగా, సీసీటీవీ కెమెరాలు అక్కడికి వెళ్లే కస్టమర్ల ప్రైవసీని పాడు చేస్తాయని కోర్టు అభిప్రాయపడింది. కెమెరాల కారణంగా బార్ యజమానులు, బార్ గర్ల్ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషనర్లు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఇదే సమయంలో మరో కేసులో భాగంగా, డ్యాన్స్ బార్లలో మద్యం అమ్మకాలను నిషేధించే ఆలోచనలో ఉన్నట్టు మహారాష్ట్ర తరఫు న్యాయవాది వాదించగా, సుప్రీంకోర్టు తప్పుబడుతూ, రాష్ట్రమంతటా మద్యం అమ్మకాలు ఎందుకు బ్యాన్ చేయరని ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 24కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.