: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేత వీహెచ్


హైదరాబాద్‌లోని రహదారుల దుస్థితిపై ఇందిరాపార్క్ వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ఈరోజు ధ‌ర్నాకు దిగారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీఆర్ఎస్ నేత‌లు గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. హైద‌రాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామని, రోడ్డు మీద గుంత చూపిస్తే వెయ్యి రూపాయ‌లు ఇస్తామని టీఆర్ఎస్ నేతలు గొప్ప‌లు చెప్పుకున్నార‌ని, ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని ఆయన ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌లో ఎక్క‌డికెళ్లినా గుంతలే క‌న‌ప‌డుతున్నాయ‌ని ఆయన అన్నారు. ప్ర‌జ‌లు ఇంటి నుంచి బయటికొస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నార‌ని, వారు మళ్లీ ఇల్లు చేరే వరకు భరోసా లేదని వీహెచ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News