: ట్విట్టర్ ఫాలోవర్స్ లో మహేశ్ బాబు తరువాత రానాదే పై చేయి
'బాహుబలి'లో భల్లాలదేవ పాత్రలో అదరగొట్టిన ప్రముఖ నటుడు రానా సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు. దక్షిణాదినే కాక బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ ట్విట్టర్లో తన అనుచరుల సంఖ్యను మరింత పెంచుకొని 20 లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో అంతర్జాలంతో వెలిగిపోతున్నాడు. మహేశ్‌బాబును మినహాయిస్తే మిగిలిన టాలీవుడ్ యంగ్ కథానాయకులందరికీ ఇప్పటివరకు సుమారు పదిలక్షల మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే రానా మాత్రం సామాజిక మాధ్యమంలో దానికి రెట్టింపు అభిమానులని సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ట్విట్టర్లో తన అభిమానులకు రానా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం మహేశ్‌బాబుకి ట్విట్టర్లో 24 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ తరువాతి ఆ స్థానం రానాదే!