: 8 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ నోగట్ తో జియోమీ 'మీ నోట్ 2 ప్రో'... లీకైన స్పెసిఫికేషన్స్!


మరో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు విజయవంతమైన మోడల్స్ ను ఇండియాలో విడుదల చేసిన జియోమీ, తాజాగా 'మీ నోట్ 2 ప్రో' పేరిట కొత్త మోడల్ ఫోన్ ను తయారు చేయగా, దీని వివరాలు ఆన్ లైన్లో లీకై చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 2.6 జీహెచ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్ ఉంటాయని, ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ నోగట్ సహాయంతో పని చేస్తుందని తెలుస్తోంది. 64, 128 జీబీ మెమొరీలతో రెండు వేరియంట్లు ఉన్నాయని, యూఎస్బీ సీ టైప్ పోర్టు, రెండు స్పీకర్లు, ముందువైపు ఫింగర్ ప్రింట్ స్కానర్లు, 3,600 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉంటాయని సమాచారం. కాగా, ఈ ఫోన్ ను 27వ తేదీన బీజింగ్ లోని చైనా నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో విడుదల చేసేందుకు జియోమీ నిర్ణయించింది. దీని ధర భారత కరెన్సీలో ఎంచుకునే వేరియంట్ ను బట్టి సుమారుగా రూ. 25 వేల నుంచి రూ. 28 వేల మధ్య ఉంటుందని సమాచారం.

  • Loading...

More Telugu News