: బ్రాడ్ పిట్ నుంచి విడాకులు కోరిన ఏంజెలినా జోలీ


పన్నెండేళ్ల ప్రేమ బంధానికి, రెండున్నరేళ్ల వైవాహిక బంధానికి హాలీవుడ్ స్టార్ జంట ఏంజెలీనా జోలీ(41), ఆస్కార్ ఆవార్డు విజేత బ్రాడ్ పిట్ (52) స్వస్తి చెప్పనున్నారు. 2004 నుంచి ప్రేమ బంధంతో కలిసి జీవించిన వీరిద్దరూ 2014లో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఆరుగురు పిల్లలు. ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకోగా, ముగ్గురు పిల్లలు వీరి దాంపత్యానికి చిహ్నంగా పుట్టారు. ఎన్నో ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట హాలీవుడ్ లో 'మోస్ట్ అడోరబుల్ కపుల్'గా పేరుతెచ్చుకుంది. అయితే, బ్రాట్ పిట్ వ్యవహారశైలితో విసిగిపోయిన ఏంజెలీనా జోలీ అతని నుంచి విడిపోవడమే మేలు అని భావించింది. దీంతో అటార్న్ రాబర్ట్ వద్ద విడాకులు దరఖాస్తు చేసుకొంది. తన కుటుంబ క్షేమం కోరి తానీ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. దీనిని బ్రాడ్ పిట్ కూడా నిర్ధారించడం విశేషం. విడాకులు తీసుకుంటున్నామని చెప్పడం బాధగా ఉందని తెలిపాడు. అయితే తమిద్దరి చుట్టూ చోటుచేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుందని, తమకు మీడియా కొంత స్వేచ్ఛను ఇవ్వాలని బ్రాడ్ పిట్ కోరాడు.

  • Loading...

More Telugu News