: అపెక్స్ కౌన్సిల్ సమావేశం కేవలం 30 నిమిషాలే!...ఏపీ, టీఎస్ వాదనలు ఐదేసి నిమిషాలే!


కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య రెండున్నరేళ్లుగా నలుగుతున్న వివాదాన్ని కొలిక్కితేనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కేవలం అరగంటసేపు మాత్రమే జరగనుంది. నేటి మధ్యాహ్నం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు సరిగ్గా 2 గంటలకు సమావేశం కానున్నాయి. సమావేశం ప్రారంభమైన తరువాత కేంద్ర ప్రభుత్వ ప్రణాళికను 2:05 నిమిషాలకు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులకు పావు గంటసేపు వివరించనున్నారు. అనంతరం 2:20 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదన వినిపించనుంది. ఆ తరువాత 2:25 నిమిషాలకు తెలంగాణ ప్రభుత్వం తన వాదన వినిపించనుంది. 2:30 నిమిషాలకు సమావేశం ముగుస్తుంది, అనంతరం 2:30 నిమిషాలకు అధికారులతో సమావేశమైన అనంతరం కేంద్ర మంత్రి ఉమాభారతి 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

  • Loading...

More Telugu News