: ఇకపై ముంబయి రైల్వేస్టేషన్లలో పిజ్జా మెషీన్లు
ముంబయి రైల్వేస్టేషనల్లో ఇకపై పిజ్జా మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఐఆర్ సీటీసీ ముంబయి రైల్వేస్టేషన్లలో ఇన్ స్టాంట్ పిజ్జా వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనుంది. ముంబయి సెంట్రల్, అంధేరీ, ఛత్రపతి శివాజీ టెర్మినస్, కల్యాణ్, లోకమాన్య తిలక్ టెర్మినస్ స్టేషనల్లో ఈ పిజ్జా మెషిన్లను ఏర్పాటు చేస్తారు. మెషిన్ లో టోకెన్ పెట్టి నచ్చిన పిజ్జాను వినియోగదారులు సెలక్ట్ చేసుకోవచ్చు. కేవలం ఐదు నిమిషాల్లో పిజ్జా తయారై బయటకు వస్తుందని, ఈ మిషన్ సర్వీసులను ఇతర రైల్వేస్టేషన్లకూ విస్తరిస్తామని ఐఆర్ సీటీసీ అధికారులు పేర్కొన్నారు.