: హైదరాబాదులోని జూ పార్కు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం


హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటన దృశ్యాలు ఓ కమర్షియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజ్ లో నిక్షిప్తమయ్యాయి. టూవీలర్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కుడివైపు నుంచి ఎడమవైపు రోడ్డు దాటుతుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీ కొట్టింది. దీంతో టూవీలర్ పై వెళ్తున్న ఆ ఇద్దరూ వ్యక్తులు అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డారు. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలు కాగా, టూవీలర్ ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News