: సచిన్ కార్ల జాబితాలో మరో కొత్త వాహనం.. మాస్టర్ బ్లాస్టర్ అభిరుచికి తగ్గా డిజైన్


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కార్ల జాబితాలో మరో కొత్త కారు చేరింది. ఈ ఏడాదిలో సచిన్ కొనుగోలు చేసిన రెండో కారు ఇది. ఎం స్పోర్ట్ ప్యాకేజీ ఉన్న బీఎండబ్ల్యూ 750 ఎల్ ఐ వాహనాన్ని సచిన్ కొనుగోలు చేశాడు. సచిన్ అభిరుచులకు అనుగుణంగా సదరు సంస్థ ఈ కారును డిజైన్ చేసింది. ఇప్పటికే కస్టమైజ్డ్ బీఎం డబ్ల్యూ ఐ8ను సచిన్ వాడుతుండటం గమనార్హం. ఇక ఈ కారు ప్రత్యేకతల విషయానికొస్తే... ఇంజిన్ లోకి గాలి వెళ్లి ఇంధన సామర్థ్యం పెంచేందుకుగాను ఈ కారుకు పెద్ద కిడ్నీ గ్రిల్, లేజర్ లైట్ హెడ్ ల్యాంప్స్, 20 అంగుళాల వీస్పోక్ అలాయ్ వీల్స్, రెండు టెయిల్ ల్యాంప్ లకు క్రోమ్ స్ట్రిప్, సచిన్ లోగోతో లెదర్ ఇంటీరియర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News