: 'పింక్'లో అమితాబ్ నటన అద్భుతం: సచిన్ టెండూల్కర్
'పింక్' సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా విడుదలై కలెక్షన్లలో దూసుకుపోతున్న 'పింక్' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పనిచేసిన టీం విజయానందంలో ఉండగానే టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. అమితాబ్ బచ్చన్ నటన ఈ సినిమాకి హైలైట్ అని పేర్కొన్నాడు. అంత గొప్పగా నటించిన అమితాబ్ కు థాంక్స్ చెప్పాడు. ఈ సినిమాలో అంగద్ బేడీ నటన కూడా చాలా బాగుందని అన్నాడు. సామాన్య యువకుడి నుంచి స్టార్ హీరోగా మారే క్రమం బాగుందని చెప్పిన సచిన్, సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని చిత్ర యూనిట్ ను అభినందించాడు. ముఖ్యంగా తనను ఆకట్టుకున్న అంశం ఏంటంటే, ఈ సినిమాలో మంచి సందేశం ఇచ్చారని అన్నాడు.