: సల్మాన్ ఖాన్ నాతో సినిమా చేయనని అన్నారు: సోనమ్ కపూర్


సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వారసులకు అవకాశాలు సులువుగా వచ్చేస్తాయని చాలా మంది భావిస్తుంటారని, కానీ అది తప్పని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపింది. నిజానికి తాను అనిల్ కపూర్ కుమార్తె కావడం వల్లే చాలా అవకాశాలు చేజారాయని నిట్టూరుస్తోంది. 'ప్రేమ్ రతన్ ధన్ పాయే' సినిమా అవకాశం కూడా తప్పిపోయేదని సోనమ్ చెప్పింది. ఈ సినిమా కాస్టింగ్ గురించి దర్శకులతో మాట్లాడిన సల్మాన్ ఖాన్ హీరోయిన్ తాను అనగానే వద్దన్నాడని సోనమ్ చెప్పింది. అనిల్ కపూర్ తన క్లోజ్ ఫ్రెండ్ అని, స్నేహితుడి కుమార్తెతో రొమాన్స్ ఏంటని దర్శక, నిర్మాతలను ప్రశ్నించాడని తెలిపింది. ఆమెతో రొమాన్స్ చేయడం తన వల్ల కాదని అన్నాడని, చివరకు వాళ్లు సర్ది చెప్పడంతో ఆ అవకాశం తనకు లభించిందని, ఆ సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పింది. అలాగే చాలా అవకాశాలు తనను వరించలేదని తెలిపింది. అంతెందుకు, తన తల్లికి మంచి స్నేహితురాలు ఫరాఖాన్ అని, తానింతవరకు ఆమె సినిమాలో నటించలేదని తెలిపింది. దానికి కారణం తమ మధ్య ఉన్న బంధం అని, ఆమె తనను నటిగా చూడరని తెలిపింది. మరి అలియా భట్, శ్రద్దా కపూర్ ఎలా నిలదొక్కుకున్నారు? అని అడిగితే అలియా భట్ స్వశక్తితో నిలదొక్కుకుందని తెలిపింది. దీపికా పదుకునే, ప్రియాంకా చోప్రా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా నిలదొక్కుకున్నారని చెప్పింది. అవకాశాల కోసం తన తండ్రి పేరు వినియోగించుకోనని, స్వశక్తితోనే పైకి వస్తానని తెలిపింది. ప్రస్తుతం 'వీర్ ది వెడ్డింగ్' సినిమాలో నటిస్తున్నానని తెలిపింది.

  • Loading...

More Telugu News