: స్నాప్ డీల్ అధికారిని లాగేసుకున్న ఫేస్ బుక్!
మాజీ యాహూ ఉన్నతోద్యోగి, స్నాప్ డీల్ లో చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ గా పనిచేసిన ఆనంద్ చంద్రశేఖరన్ కు ఫేస్ బుక్, తన మెసింజర్ యాప్ సీఈఓ బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే 100 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్ యూజర్లను తన ఖాతాదారులుగా చేసుకున్న ఫేస్ బుక్ మెసింజర్ యాప్ ను మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో ఈ నియామకాన్ని ఫేస్ బుక్ ఖరారు చేసినట్టు తెలిసింది. తాను ఫేస్ బుక్ లో చేరిన విషయాన్ని ఆనంద్ చంద్రశేఖరన్ స్వయంగా వెల్లడించారు. ఫేస్ బుక్ మెసింజర్ కు సేవలందించే అవకాశం రావడం తనకు సంతోషకరమని, 'కనెక్టింగ్ ఇండియా' అనే నినాదంతో ఇండియాలోని మరింత మందికి నెట్ కనెక్టివిటీని దగ్గర చేసే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.