: సౌదీ విమానానికి బాంబు బెదిరింపు...చుట్టుముట్టిన బద్రతా సిబ్బంది
సౌదీ అరేబియాకు చెందిన విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ లో ఇచ్చిన సమాచారంతో రెండు దేశాల భద్రతాధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే... సౌదీఅరేబియాలోని జెడ్డా నుంచి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వెళ్తున్న సౌదీ అరేబియాకు చెందిన ఎస్వీఏ 872 విమానంలో బాంబు ఉందంటూ ఆగంతుకుడు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన అధికారులు మనీలా ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానం దిగే సమయంలో పైలట్ కు సమాచారం ఇచ్చిన భద్రతా బలగాలు, విమానం ల్యాండ్ అవ్వగానే ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ప్రయాణికులను కిందికి దించేసిన అధికారులు, విమానాన్ని అదుపులోకి తీసుకుని అణువణువూ గాలిస్తున్నారు.