: కాకతీయ మెయిన్ కెనాల్ కు గండి... తీవ్ర భయాందోళనల్లో ప్రజలు
శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నుంచి కరీంనగర్ జిల్లాకు సాగు, తాగు నీరందించే కాకతీయ ప్రధాన కాలువకు గండి పడింది. కాలువ నీరు మానాల చెరువులోకి చేరడంతో, చెరువుకూ గండి పడింది. దీంతో మండల పరిధిలోని మాండ్యంపల్లి గ్రామం నీట మునగగా, స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించే పనులు మొదలు పెట్టారు. సమీప గ్రామాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాలువలో అధిక నీటి ప్రవాహం ఉండటంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగినట్టు తెలుస్తోంది. రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను నిలిపివేశామని, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని తగ్గించేందుకు పిల్లకాలువల్లో ప్రవాహాన్ని పెంచామని అధికారులు తెలిపారు.