: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. నేడు, రేపు భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో రెండు రోజులుగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు, రేపు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.