: సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘2.ఓ’లో కళాభవన్ షాజన్.. ఆనవాయతీ కొనసాగిస్తున్న శంకర్
తన ప్రతి చిత్రంలోనూ మలయాళ నటులకు అవకాశం కల్పించే స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సారి ఆ అవకాశాన్ని ‘దృశ్యం’ ఫేమ్ కళాభవన్ షాజన్‌కు కల్పించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2.ఓ’(2.o)లో ఆయనను ఓ ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశారు. దృశ్యం సినిమాలో మోహన్‌లాల్‌తో కలిసి నటించిన కళాభవన్ నటనకు మంత్రముగ్ధుడైన శంకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రోబో చిత్రంలో దివంగత నటుడు కళాభవన్ మణికి అవకాశం కల్పించిన శంకర్ అంతకుముందు ముదల్వన్ సినిమాలో కొచ్చిన్ మణిని తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా కళాభవన్ షాజన్‌కు అవకాశం కల్పించి ఆనవాయతీని కొనసాగిస్తున్నారు.