: భారత్ తో ఆడనున్న కివీస్ జట్టు ఇదే
ఈ నెల 22 (గురువారం) నుంచి కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక తొలి టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. సెలెక్టర్ గావిన్ లారెన్స్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కోరె అండర్సన్, ట్రెంట్ బౌల్ట్, బ్రాస్ వెల్, ఆంటన్ డేవీచ్, మార్టిన్ గుప్తిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, జేమ్స్ నీషామ్, ల్యూక్ రోంచి, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధి, రాస్ టైలర్, బీజే వాట్లింగ్ లు చోటు సంపాదించుకున్నారు. కాగా, ఫాం లేమితో ఇబ్బంది పడుతున్న ఆల్ రౌండర్ కోరె ఆండర్సన్ తోపాటు బ్యాట్స్ మన్ ఆంటన్ డేవిచ్, కీపర్ బీజే వాట్లింగ్, గాయంతో స్థానం కోల్పోయిన స్టార్ పేసర్ టిమ్ సౌథీలను జట్టులోకి తీసుకోవడం ద్వారా బలమైన, అనుభవం కలిగిన జట్టును ఎంచుకుంది. ఈ టూర్ లో కివీస్ జట్టు భారత్ తో మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడనుంది.