: యూరీ సెక్టార్ ఘటనపై అనుచిత వ్యాఖ్యల ఫలితం... కాశ్మీర్ విద్యార్థి బహిష్కరణ
యూరీ సెక్టార్ ఘటనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాశ్మీర్ విద్యార్థిని యూనివర్శిటీ నుంచి బహిష్కరించారు. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేస్తున్న ముదాస్సర్ యూసఫ్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఘటనపై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు. జాతికి వ్యతిరేకంగా, ప్రజల భావాలు దెబ్బతినే విధంగా ఈ వ్యాఖ్యలు చేసినందునే అతన్ని వర్శిటీ నుంచి బహిష్కరించాలని వైస్ చాన్సలర్, లెప్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా నిర్ణయం తీసుకున్నారని వర్శిటీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. సున్నితమైన అంశంపై ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఆ విద్యార్థిని వర్శిటీ నుంచి తొలగించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని వైస్ చాన్సలర్ కు బీజేపీ లోక్ సభ సభ్యులు లేఖ రాశారు.