: అశోక్ గజపతిరాజుని నేనెప్పుడూ దూరం పెట్టలేదు: సుజనా చౌదరి
ఏపీకి ప్రత్యేక సాయంపై చర్చలు జరిగినప్పుడు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఢిల్లీలో లేరని, అందుకే ఆయన ఈ చర్చల్లో పాల్గొనలేదు తప్పా, తానెప్పుడూ ఆయన్ని దూరంగా పెట్టలేదని మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అశోక్ గజపతిరాజు అంటే తన కెంతో గౌరవమని అన్నారు. ఏపీకి ప్రత్యేక సాయం చర్చల్లో గజపతిరాజుని దూరంగా పెట్టారనే వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఆయన సీనియర్ మంత్రి, అందరూ గౌరవిస్తారని అన్నారు. ఏపీకి సాయంపై గజపతిరాజు కూడా చాలా ప్రయత్నాలు చేశారని, గత రెండు సంవత్సరాలుగా ఆయన చాలా మీటింగ్ లలో పాల్గొన్నారన్నారు.