: పాకిస్థాన్ అభిమానికి సమాధానమిచ్చిన సెహ్వాగ్
జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై వరుస ట్వీట్లతో విరుచుకుపడిన ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కు అబ్దుల్లాఫ్రీద్ అనే పాక్ అభిమాని స్పందించాడు. మీరంటే మాకు చాలా గౌరవమని అన్నాడు. దానికి సెహ్వాగ్ సమాధానమిస్తూ, మీ అభిమానానికి ధన్యవాదాలు అన్నాడు. ఏదైనా దేశం ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంటే...ఆ దేశ ప్రజలు దానికి వ్యతిరేకంగా స్పందించాల్సిన అవసరం ఉందని సూచించాడు. కాగా, గత కొంత కాలంగా వరుస ట్వీట్లతో సెహ్వాగ్ సోషల్ మీడియాలో భారతీయులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.