: ప్రత్యేక హోదాతో వచ్చేవి, ప్యాకేజీలో రానివీ ఏమిటో చెప్పాలి: ప్రత్తిపాటి పుల్లారావు
ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఈరోజు గుంటూరులో రైతులతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రతిపక్షనేతలు దుష్ప్రచారం ఆపాలని అన్నారు. ప్రత్యేక హోదాతో వచ్చేవి, ప్యాకేజీలో రానివీ ఏమిటో ప్రతిపక్షాలు చెప్పాలని ఆయన సవాలు విసిరారు. తాము ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కావాలని కోరుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటోందని, రబీలో 40 శాతం అపరాల విత్తనాలు పంపిణీ చేశామని చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.