: డెంగ్యూ నుంచి కోలుకున్నా...మీ ప్రేమాప్యాయతలకు ధన్యవాదాలు: విద్యాబాలన్


ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ డెంగ్యూ ఫీవర్ నుంచి కోలుకున్నానని తెలిపింది. గతవారం డెంగ్యూ ఫీవర్ సోకడంతో విద్యాబాలన్ ఆసుపత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. డెంగ్యూ సోకడంపై విచారణ చేసిన గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు... ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఉన్న షాహిద్ కపూర్ కు చెందిన స్విమ్మింగ్ పూల్ లో నీరు మార్చని కారణంగా దోమలు పెరిగి విద్యాబాలన్ కు డెంగ్యూ సోకినట్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే. దీంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆమెను 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇల్లు చేరిన అనంతరం సోషల్ మీడియాలో అభిమానులను విద్యాబాలన్ పలకరించింది. అభిమానులు చూపించిన ప్రేమాప్యాయతలు మరువలేనని తెలిపింది. ఆసుపత్రిలో చేరిన తనకు నైతిక మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.

  • Loading...

More Telugu News