: తిరుపతిలో మంజునాథ కమిషన్ పర్యటన.. బీసీ సంఘాల ఆందోళన
కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ ఈరోజు తిరుపతిలో పర్యటిస్తోంది. పర్యటనలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. అయితే, మరోవైపు మంజునాథ కమిషన్ పర్యటనను వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపులను బీసీల్లో చేర్చడానికి ఒప్పుకోబోమని మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. దీనివల్ల బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. తిరుపతిలో రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులని మోహరింపజేశారు.