: సిద్ధంగా ఉండండి: ఆర్మీ బెటాలియన్, వాయుసేన విమానాలకు ఆదేశం


భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఆర్మీ బెటాలియన్లు, భారత వాయుసేన నిర్వహణలో ఉన్న ఎయిర్ బేస్ స్టేషన్లు 'ఫుల్ అలర్ట్'తో ఉండాలని ఆదేశాలు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విమానాలు, సైనికులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మయన్మార్ లో జరిపిన 'సర్జికల్ స్ట్రయిక్స్' వంటి కోవర్ట్ మిలిటరీ ఆపరేషన్ చేసే ఉద్దేశం భారత ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేనట్టు తెలుస్తోంది. మరోవైపు సరిహద్దులు దాటకుండా పాకిస్థాన్ రక్తం కళ్లజూడాల్సిందేనని వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వహిస్తున్న సైనికులు గట్టి పట్టుతో ఉన్నారు. పాకిస్థాన్ లోని ఆర్మీ పోస్టులపై భీకర దాడులు చేయడం, వారి బంకర్లను ఇవతలి వైపు నుంచే సర్వ నాశనం చేయడం, హెవీ మోటార్లు ఉపయోగించి కాల్పులు జరపడం, తేలికపాటి క్షిపణులతో పాక్ సరిహద్దు భద్రతా స్థావరాలను చిన్నాభిన్నం చేయడం వంటి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో అమలు జరిపిన పద్ధతుల్లోనే పాక్ కు గట్టి బుద్ధి చెప్పేలా మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News