: యూరి ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌లో 20కి చేరిన మృతుల సంఖ్య.. మరో ఐదుగురు జవాన్ల పరిస్థితి విషమం


జమ్ముకశ్మీరులోని యూరిలో ఉగ్రవాదులు నిన్న‌ భార‌త‌ సైనిక స్థావరంపై దాడి చేసి 17 మంది సైనికుల ప్రాణాలు తీసిన సంగ‌తి తెలిసిందే. దాడిలో మ‌రో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడి శ్రీ‌న‌గ‌ర్‌లోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈరోజు ఉద‌యం చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు జ‌వాన్లు ప్రాణాలు విడిచారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరింది. మ‌రో ఐదుగురు జ‌వాన్ల ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. మృతుల సంఖ్య మ‌రింత‌ పెరగవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News