: పాకిస్థాన్ ను ఏం చేద్దాం?: అత్యున్నత సమీక్షలో తేల్చనున్న కేంద్రం


భారత సైన్యం చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రదాడికి పాకిస్థాన్ ముష్కరులు తెగబడి 17 మంది జవాన్లను పొట్టన బెట్టుకున్న వేళ, నేడు అత్యున్నత స్థాయి సమీక్ష జరుగనుంది. జాతి భద్రతపై జరిగే ఈ సమీక్షకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించనుండగా, అన్ని రక్షణ విభాగాల ప్రతినిధులూ హాజరు కానున్నారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ లతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అధ్యక్షులు, హోం, రక్షణ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు. వీరితో పాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్స్, ఇతర ముఖ్య అధికారులకు కూడా పిలుపు అందింది. ఈ సమీక్షలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిలువరించడంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని ఈ ఉదయం కలిసిన మనోహర్ పారికర్ దాడి జరిగిన తీరును, వినియోగించిన ఆయుధాలను, ముష్కరులు ఎలా జొరబడ్డారన్న వివరాలను తెలియజేశారు.

  • Loading...

More Telugu News