: నేను బాగానే ఉన్నా.. ఆందోళన వద్దు: ప్రముఖ సినీ హాస్య నటుడు గౌండమణి
తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని ప్రముఖ తమిళ సినీ హాస్య నటుడు గౌండమణి పేర్కొన్నారు. పలు సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించిన ఈ సీనియర్ హాస్యనటుడు తాజాగా హీరోగానూ నటిస్తున్నారు. గౌండమణి ఆరోగ్యం విషమంగా ఉందంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేస్తుండడంతో ఆయన స్పందించక తప్పలేదు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన తన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరో తనకు తెలియదని, ఈ ప్రచారం వల్ల అతడికి కలిగే ప్రయోజనం ఏమిటో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం కథా చర్చల్లోనూ పాల్గొంటున్నానని గౌండమణి పేర్కొన్నారు. తన తాజా చిత్రం ప్రారంభం సందర్భంగా మీడియా ముందుకు వస్తానని ఆయన తెలిపారు.