: సరబ్ ను వైద్యం కోసం విదేశానికి పంపక్కర్లేదు: కమిటీ
లాహోర్ లోని జిన్నా ఆస్పత్రిలో కోమాలో ఉన్న సరబ్ జిత్ ను వైద్యం కోసం విదేశానికి తరలించక్కర్లేదని పాక్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. నలుగురు సభ్యుల నిపుణుల కమిటీ ఈ ఉదయం జిన్నా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చింది. అతడికి చికిత్స అందించడానికి విదేశీ వైద్య నిపుణులు కూడా అవసరం లేదని అభిప్రాయానికి వచ్చిందని సమాచారం. కోమాలో ఉన్నా రక్తంలో ఆక్సిజన్, పల్స్ రేట్, బ్లడ్ ప్రెషర్ అన్నీ సాధారణంగానే ఉన్నాయని, సరబ్ తిరిగి స్ప్రుహలోకి వస్తాడని చికిత్స చేస్తున్న వైద్యులు కమిటీకి తెలిపారు.