: ఎల్బీనగర్ లో రెండు వర్గాల ఘర్షణ... ఏడుగురికి కత్తిపోట్లు
హైదరాబాద్ ఎల్బీనగర్ లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు కత్తిపోట్లకు గురవగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సెప్టిక్ ట్యాంక్ విషయంలో తలెత్తిన ఘర్షణ కారణంగా రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి కత్తిపోట్లకు దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.