: తనకు రక్షణగా వస్తున్న పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే, వదిలేసి వెళ్లిపోయిన ఆప్ మంత్రి


ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. తనకు రక్షణగా వస్తున్న పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి తల్లకిందులుగా పడిన వేళ, వారికి సాయం చేయకుండా వెళ్లిపోయారని గోపాల్ రాయ్ మీద ఆరోపణలు వస్తున్నాయి. చత్తీస్ ఘర్ లోని భానుప్రతాప్ పూర్ కు మంత్రి గోపాల్ రాయ్ వెళుతున్న వేళ, ఒక పైలట్ కారు టైర్ బరస్ట్ అయ్యి, పక్కనే ఉన్న పొలాల్లోకి జారిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులకు గాయాలు కాగా, ఒకరు మరణించారు. మంత్రికి ఎస్కార్ట్ గా వస్తున్న ఇతర వాహనాలు ఆ పోలీసులకు సాయం చేసేందుకు ఆగగా, గోపాల్ రాయ్ కనీసం కారు దిగి చూడకుండా వెళ్లిపోయారని తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్, బీజేపీలు విరుచుకుపడ్డాయి. గోపాల్ ఎంతమాత్రమూ మానవత్వం చూపకుండా, స్వీయ ప్రయోజనాల కోసం వెళ్లిపోయారని ఆరోపించాయి.

  • Loading...

More Telugu News