: ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీపై ఆలోచిస్తాం: నాయిని
ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేసే అంశమై, ప్రజలు కోరుకుంటే ఆలోచిస్తామని హోం మంత్రి, టీఆర్ఎస్ నేత నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసే ఉంటున్నారని, చంద్రబాబునాయుడు మాత్రం అప్పుడప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నాడని ఆరోపించారు. హర్యానా, పంజాబ్ లా రెండు రాష్ట్రాలూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన నాయిని, ఇద్దరు సీఎంలూ కలసి చర్చలు జరపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఏపీకి ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం నిధులను ఇవ్వలేదని, తెలంగాణకు నిధులు కూడా ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.