: మోహన్ బాబుది రాక్షస ప్రేమ... రాకుంటే గొడవయ్యేది: చిరంజీవి
నిన్న రాత్రి విశాఖపట్నంలో జరిగిన మోహన్ బాబు సన్మానం, సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి, కొన్ని సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ ఫంక్షన్ కు రావాలని మోహన్ బాబు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని, ఆ వెంటనే తాను అంగీకరించానని అన్నారు. "ఇంతకు ముందు నా డేట్స్ నా వద్దే ఉండేవి. కానీ ఇప్పుడు షూటింగ్ ఉండటంతో ఏం చేసినా ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి నేడు షూటింగ్ ఉంది. ఇక్కడికి రాకపోతే, ఓ రాక్షసుడితో గొడవైపోతుంది, షూటింగ్ క్యాన్సిల్ చేయండి" అని యూనిట్ సభ్యులకు చెప్పినట్టు చిరంజీవి తెలిపారు. మోహన్ బాబు చూపే ప్రేమ రాక్షస ప్రేమని, దాని వెనుక ఎంతో వాత్సల్యం దాగుంటుందని అన్నారు.