: బంగాళాఖాతపు రాకాసి అలకు బలైన విప్రో ఉద్యోగి


ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకు చెందిన ఉద్యోగి సుమంత్రా బెనర్జీ అల్లకల్లోలంగా ఉన్న బంగాళాఖాతంలో ఈతకు వెళ్లి, ఓ రాకాసి అలకు బలికాగా, మరో ఇద్దరు స్నేహితులు గల్లంతయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని మందర్మాని బీచ్ లో జరిగింది. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాకు చెందిన 15 మంది మిత్ర బృందం సముద్రం వద్దకు వచ్చిన వేళ, ఈ విషాదం జరిగింది. వీరిలో 10 మంది సముద్ర స్నానానికి వెళ్లగా, సుమంత్రతో పాటు లోకేష్ మల్ హోత్రా, బిన్నీ చౌదరిలు మరికాస్త లోతుకు వెళ్లారు. ఆ సమయంలో వచ్చిన భారీ అలలు వీరిని సముద్రంలోకి లాక్కెళ్లాయి. సుమంత్ర మృతదేహం ఒడ్డుకు కొట్టుకు రాగా, గల్లంతైన మిగతా ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News