: 2017లోగా రామమందిరం... ఆపే శక్తి ఎవరికీ లేదన్న సుబ్రహ్మణ్య స్వామి
అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని, దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని బీజేపీ నేత, పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, టెక్సాస్ లో గ్లోబల్ హిందూ హెరిటేజ్ సంస్థ 'ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొని ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. అయోధ్య, బాబ్రీ మసీదు, రామమందిరం అంశాలను ప్రస్తావించారు. 2017 ముగిసేలోగానే దేవాలయం నిర్మాణం జరుగుతుందని, అది చట్టపరంగానే పూర్తవుతుందని ఆయన అన్నారు. ఎవరూ అడ్డుకోలేరని, ఎన్నికలు వస్తున్నాయని తానీ మాట చెప్పడం లేదని ఆయన అన్నారు.