: మూడేళ్లకే మూడు చెరువుల నీరు తాగుతున్నాను: రాజ్ తరుణ్


సినీ పరిశ్రమలో ప్రవేశించి మూడేళ్లైందని యంగ్ సినీ హీరో రాజ్ తరుణ్ చెప్పాడు. విశాఖపట్టణంలో జరిగిన సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మూడేళ్లకే మూడు చెరువుల నీరు తాగుతున్నానని అన్నాడు. అలాంటిది ఒక వ్యక్తి 40 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడిగా నిరూపించుకోవడం చాలా పెద్ద విషయమని చెప్పాడు. అలా కొనసాగాలంటే ఎంతో అంకితభావం, గౌవరభావం ఉండాలని, అది మోహన్ బాబుగారికి ఎంతో ఉందని అన్నాడు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించడమే కాకుండా, ఎన్నో సినిమాలను నిర్మించారని అన్నాడు. ఆయన మరింత కాలం ఇలాగే అందర్నీ అలరించాలని రాజ్ తరుణ్ ఆకాంక్షించాడు.

  • Loading...

More Telugu News