: సుబ్బరామిరెడ్డి మంచి పార్లమెంటేరియన్...ఇదో అద్భుత కార్యక్రమం: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్
మంచి మిత్రుడు టి.సుబ్బరామిరెడ్డికి 73వ పుట్టినరోజు శుభాకాంక్షలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. విశాఖపట్టణంలోని మున్సిపల్ స్టేడియంలో జరిగిన సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుబ్బరామిరెడ్డి పార్లమెంటులో మంచి మిత్రుడని అన్నారు. పార్లమెంటులో జరిగే ప్రతి చర్చలో ఆయన పాల్గొని మంచి పార్లమెంటేరియన్ అనిపించుకున్నాడని ప్రశంసించారు. సినీ నటుడు మోహన్ బాబు 40 ఏళ్ల సినీ ప్రస్థానంతో ఆయన కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కాలేదని అన్నారు. ఆయన దేశం మొత్తం తెలిసిన నటుడని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వధర్మ సమభావనను సుబ్బరామిరెడ్డి ప్రదర్శించడం అభినందనీయమని ఆయన తెలిపారు. మనమంతా భారతమాత బిడ్డలమని, ఇదే సమభావనను అందరం అలవరచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. విద్వేషాలు, శత్రుభావం మంచిది కాదని ఆయన చెప్పారు. భారతమాత బిడ్డలుగా సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు. ఇదో అద్భుతమైన కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు.