: బీహార్ లో దారుణం...ఓవర్ టేక్ చేశాడని కత్తితో పొడిచేసిన ఎమ్మెల్యే కుమారుడు


బీహార్ లో దారుణం చోటుచేసుకుంది. తన కారుతో బైక్ ను ఓవర్ టేక్ చేయడంలో విఫలమైన ఎమ్మెల్యే కుమారుడు ఆగ్రహంతో ద్విచక్రవాహనదారును కత్తితో పొడిచిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఔరంగాబాద్ జిల్లాలోని ఓబ్రా అనే ప్రాంతంలో ఆర్జేడీ ఎమ్మెల్యే బీరేంద్ర సిన్హా కుమారుడు కునాల్ సిన్హా కారులో వెళుతుండగా, అదే రోడ్డులో ఓ యువకుడు బైక్ పై వేగంగా వెళ్తున్నాడు. దీనిని గుర్తించిన కునాల్ అతని బైక్ ను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఆగ్రహానికి గురైన కునాల్ మరోసారి వేగంగా వెళ్లి, బైకర్ ను నిలువరించి దాడికి దిగి, అతనిని కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన బాధితుడు స్థానిక ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కునాల్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బీరేంద్ర... తన కుమారుడు చాలా మంచి వాడని, బాధితుడే, తనను తాను కత్తితో గాయపరుచుకుని ఆసుపత్రిలో చేరాడని అన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు తన ప్రతిష్ఠను మసకబార్చేందుకు ఇలా చేసి ఉంటారని అన్నారు. త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News