: నా మాటలను ముందుగా పురంధేశ్వరి అర్థం చేసుకున్నారు: వెంక‌య్య


ప్ర‌త్యేక హోదా అంశంలో త‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌లను కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు తిప్పికొట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్యాకేజీని సాధించినందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బీజేపీ నేతలు ఆయ‌న‌ను విజ‌య‌వాడ‌లో స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌డంలో తాను ముందే ఉంటాన‌ని చెప్పారు. తాను ప్ర‌త్యేక హోదా లేదా ప్యాకేజీ కోసం చేస్తోన్న ప్ర‌య‌త్నంలో త‌న మాట‌ల‌ను బీజేపీ రాష్ట్ర నాయ‌కురాలు పురంధేశ్వ‌రి అంద‌రి కంటే ముందుగా అర్థం చేసుకున్నార‌ని ఆయ‌న అన్నారు. క‌నీసం పోల‌వ‌రం ప్రాజెక్టు కోస‌మైనా ప‌ట్ట‌బ‌ట్టాల‌ని ఆమె త‌న‌ను కోరిన‌ట్లు చెప్పారు. చివ‌రికి పోల‌వరం సాధ్య‌మైంద‌ని చెప్పారు. 1972 లోనే ఏపీని విభ‌జించి ఉంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ‌చిత్రం ఇప్పుడు వేరుగా ఉండేదని వెంక‌య్య‌నాయుడు అన్నారు. గ‌తంలో జై ఆంధ్ర ఉద్యమంలో తానూ పాల్గొన్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఆంధ్రా ఉద్య‌మాన్ని నీరుగార్చింది కాంగ్రెస్సేన‌ని అన్నారు. అన్ని అంశాల‌ను ప‌రిశీలించ‌కుండా కాంగ్రెస్ రాష్ట్ర విభ‌జ‌న చేసింద‌ని చెప్పారు. ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ తెచ్చినందుకు దాని ప‌ట్ల ప్ర‌జ‌లు సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. విభ‌జ‌నకు తాను అనుకూల‌మే కానీ ఏపీకి న్యాయం జ‌ర‌గాల‌ని ఆనాడు ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు వెంక‌య్య‌ తెలిపారు. ఏపీకి న్యాయం జ‌రిగేవ‌ర‌కు వెన‌కాడేది లేద‌ని అద్వానీకి తాను ముందే చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News