: తెలంగాణ‌ విమోచ‌న దినం వేడుకల్లో పాల్గొన్న బీజేపీ, టీడీపీ నేత‌లు.. విలీన దినోత్స‌వంలో పాల్గొన్న టీఆర్ఎస్ నేత‌లు


హైద‌రాబాద్‌లోని భార‌తీయ జ‌న‌తాపార్టీ కార్యాల‌యంలో ఈరోజు ఘ‌నంగా తెలంగాణ‌ విమోచ‌న దినోత్స‌వం నిర్వ‌హించారు. అందులో కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ‌, బీజేపీ రాష్ట్ర నేత‌లు ల‌క్ష్మ‌ణ్‌, కిష‌న్‌రెడ్డితో పాటు బీజేపీ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ద‌త్తాత్రేయ‌ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లోనూ తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం జ‌రుపుతున్నారు. టీటీడీపీ నేత ఎల్‌.ర‌మ‌ణ జాతీయ ప‌తాకం ఆవిష్క‌రించారు. మ‌రోవైపు టీఆర్ఎస్ నేత‌లు తెలంగాణ విలీన దినోత్స‌వం జ‌రుపుకున్నారు. హైద‌రాబాద్‌లోని టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. సెప్టెంబ‌ర్ 17 రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామ్యంలోకి వచ్చిన రోజని ఆయ‌న అన్నారు. ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ సంద‌ర్భంగా తాము అధికారంలోకి వ‌స్తే విమోచ‌న దినోత్స‌వం జ‌రిపిస్తామ‌ని ఏనాడూ చెప్ప‌లేద‌ని నాయిని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి స‌హా ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News