: విషాదాంతమైన పార్టీ.. కరీంనగర్‌లో బావిలో పడిన ట్రాక్టర్.. నలుగురు మృతి
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. అంతకుముందు ట్రాక్టర్ పోలీసుల బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏఎస్సై రాజేందర్, కానిస్టేబుల్ జుబేర్‌కు గాయాలయ్యాయి. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు పారిపోయే ప్రయత్నంలో ఉండగా ట్రాక్టర్ అదుపుతప్పడంతో బావిలో పడింది. బావిలో పడి మృతి చెందిన వారిలో శివకుమార్, రాజు, సంతోష్, శ్రీకాంత్ ఉన్నట్టు గుర్తించారు. శివకుమార్ నాలుగు రోజుల క్రితమే ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది.