: మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు: సీఎం చంద్రబాబు


'మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు, మీరంతా కష్టపడి చదువుకుని పైకి రావాలి. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి' అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు చంద్రబాబును ఈరోజు కలిసి తమ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్య కోసం రూ.10 లక్షలు చొప్పున ఇస్తున్నామని అన్నారు. నాడు ఇంజనీరింగ్ కాలేజీలు 30 ఉండేవని, వాటి సంఖ్యను 300కు పెంచామని చెప్పారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి కూడా పాటుపడాలని విద్యార్థులకు ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News