: హైదరాబాద్ నగర వాసులూ.. మీ ప్రయాణాన్ని 2 గంటలు వాయిదా వేసుకోండి: ట్రాఫిక్ పోలీస్


హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో, ఎక్కడి ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నగర వాసులకు ఒక విజ్ఞప్తి చేశారు. ‘మీ ప్రయాణాన్ని 2 గంటల పాటు వాయిదా వేసుకోండి’ అని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ ఒక ప్రకటన చేశారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు సుమారు 2 గంటల సమయం పడుతుందన్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, పంజాగుట్టలోని సీఎం క్యాంప్ కార్యాలయం, గ్రీన్ ల్యాండ్స్, బేగం పేట్ ఫ్లైఓవర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా మెల్లిగా కదులుతోంది.

  • Loading...

More Telugu News