: వర్షాల ధాటికి వరంగల్ జిల్లాలో వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కురుస్తోన్న వర్షాలకు అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని నల్లబెల్లి మద్దెల వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులోని 30 మంది ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. వాగులో బస్సు పడిపోయిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని బస్సులోంచి బయటకు తీశారు.